ఆసక్తిని రేకెత్తిస్తూ .. ఆత్రుతను పెంచుతోన్న 'ఒక్క క్షణం' టీజర్!
- అల్లు శిరీష్ హీరోగా 'ఒక్క క్షణం'
- ఇంట్రెస్టింగ్ కంటెంట్ ను ఎంచుకున్న వి.ఐ. ఆనంద్
- కథానాయికలుగా సురభి .. శీరత్ కపూర్
- ఈ నెల చివరిలో విడుదల
ప్రధానమైన పాత్రలపై కట్ చేసిన టీజర్ చూస్తుంటే .. డైలాగ్స్ వింటుంటే ఈ సారి కూడా వెరైటీ కంటెంట్ తోనే వి.ఐ.ఆనంద్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టుగా అర్థమవుతోంది. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. రొమాన్స్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్, సినిమాపై ఆసక్తిని .. ఆత్రుతను పెంచుతోంది. "నేను ప్రేమించిన అమ్మాయి ప్రాణాల మీదకి వస్తే ఫేట్ తో నైనా .. డెస్టినీ తో నైనా .. చివరికి చావుతోనైనా పోరాడతాను" అంటూ అల్లు శిరీష్ చెప్పిన డైలాగ్ బాగా పేలింది. ఈ నెల చివరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.