మార్కెట్ లో బంగారం, వెండి ధరలు
వివిధ మార్కెట్లలో శనివారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,290, విజయవాడలో రూ.30,320, విశాఖపట్నంలో రూ.30,150, ప్రొద్దుటూరులో రూ.30,300, చెన్నైలో రూ.29,470గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.28,050, విజయవాడలో రూ.28,150, విశాఖపట్నంలో రూ.27,730, ప్రొద్దుటూరులో రూ.28,060, చెన్నైలో రూ.28,070గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.39,000, విజయవాడలో రూ.39,600, విశాఖపట్నంలో రూ.39,000, ప్రొద్దుటూరులో రూ.39,200, చెన్నైలో రూ.41,500 వద్ద ముగిసింది.