మీరాబాయి చానుకి 'టీయూవీ 300'ని బహుమతి ప్రకటించిన ఆనంద్ మహీంద్రా
- ట్వీట్ చేసిన మహీంద్రా గ్రూప్ చైర్మన్
- ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన మణిపురీ మాణిక్యం
- కరణం మల్లీశ్వరి తర్వాత ఈ ఘనత సాధించిన రెండో మహిళ
అమెరికాలోని అనాహీమ్లో జరిగిన 2017 ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో చాను 48 కేజీల విభాగంలో విజేతగా నిలిచి, ఈ ఘనత సాధించిన రెండో మహిళగా నిలిచింది. గతంలో 1994, 95ల్లో కరణం మల్లీశ్వరి రెండు బంగారు పతకాలు సాధించింది. 2016 రియో ఒలింపిక్స్‌కి కూడా చాను అర్హత సాధించింది కానీ పతకం తీసుకురాలేకపోయింది. గతంలో షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌కి కూడా ఆనంద్ మహీంద్రా టీయూవీ 300ని బహుకరించారు.