'కొలువులకై కొట్లాట' సభకు ముహూర్తం ఖరారు.. సభా వేదికకు శ్రీకాంతాచారి పేరు
- హైదరాబాద్ లోని సరూర్నగర్లో ఎల్లుండి సభ
- మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు
- హాజరుకానున్న ప్రతిపక్ష నేతలు
- ప్రకటించిన ప్రొ.కోదండరామ్
ఈ సభా ప్రాంగణానికి అమరవీరుల ప్రాంగణం అని, సభా వేదికకు శ్రీకాంతాచారి వేదిక అని పేరు పెట్టినట్లు ప్రొ.కోదండరామ్ చెప్పారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్య అధికంగా ఉందని తెలిపారు. సర్కారు ఉద్యోగాల ఖాళీల సంఖ్యపై ప్రభుత్వం రోజుకోలా మాట్లాడుతోందని అన్నారు. ఈ సభకు ప్రతిపక్ష నేతలు కూడా హాజరవుతారని చెప్పారు.