మహ్మద్ కైఫ్‌ని సూప‌ర్ మ్యాన్‌తో పోల్చిన మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహ్మద్ కైఫ్‌ని సూప‌ర్ మ్యాన్‌తో పోల్చిన మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌

  • నిన్న కైఫ్ పుట్టిన‌రోజు
  • శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేసిన స‌చిన్‌
  • 'థాంక్యూ పాజీ' అంటూ స‌మాధానం ఇచ్చిన కైఫ్‌
భార‌త మాజీ క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ కైఫ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నిన్న మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ ఓ ట్వీట్ చేశారు. కైఫ్‌కి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయ‌న‌ను సూప‌ర్ మ్యాన్ అంటూ స‌చిన్ పోల్చారు. 'మ‌న టీమిండియా సూప‌ర్ మ్యాన్ కైఫ్‌కి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు. నీకు  సూప‌ర్‌మ్యాన్ దుస్తులు మాత్ర‌మే త‌క్కువ‌య్యాయి' అని స‌చిన్ ట్వీట్ చేశారు.

దీనికి సమాధానంగా కైఫ్ కూడా ట్వీట్ చేశారు. 'థాంక్యూ పాజీ.. క్రికెట్ రంగంలో మాత్ర‌మే కాకుండా చాలా మందికి నువ్వు ఆద‌ర్శంగా నిలుస్తున్నావు' అని కైఫ్ ట్వీటారు. నిన్న 37వ వ‌సంతంలోకి అడుగుపెట్టిన కైఫ్, త‌న అంత‌ర్జాతీయ క్రికెట్ కెరీర్లో 125 వ‌న్డేలు ఆడి, 2,753 ప‌రుగులు చేశారు.
mohmed kaif
Sachin Tendulkar
birthday

More Telugu News