కుదిరితే కొరటాలతో .. లేదంటే మారుతితో.. బన్నీ ప్లానింగ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కుదిరితే కొరటాలతో .. లేదంటే మారుతితో.. బన్నీ ప్లానింగ్!

  • బన్నీతో కొరటాల కథా చర్చలు 
  • కథ నచ్చితే ఓకే చెప్పనున్న బన్నీ 
  • లేదంటే మారుతితో సెట్స్ పైకి 
  • ఆల్రెడీ కథ ఓకే చేయించి పెట్టుకున్న మారుతి  
ప్రస్తుతం మహేశ్ బాబుతో ఓ సినిమా చేస్తోన్న కొరటాల శివ, ఆ తరువాత సినిమాను చరణ్ తో చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ బోయపాటితో నెక్స్ట్ సినిమా చేయడానికి చరణ్ రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తో కొరటాల సినిమా చేయనున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఇప్పటికే రెండు .. మూడు సిటింగ్స్ అయినట్టుగా చెబుతున్నారు. అయితే ఈ కాంబినేషన్ తప్పకుండా ఓకే అవుతుందా అనే సందేహాలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి.

 గతంలో కొరటాల వినిపించిన 'శ్రీమంతుడు' కథ కూడా బన్నీకి నచ్చలేదు. దాంతో ఆయన మహేశ్ బాబుతో దానిని తెరకెక్కించాడు. మరి ఈ సారైనా కొరటాల కథపై బన్నీ నమ్మకం వుంచుతాడా? అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ కొరటాల వినిపించిన కథ సంతృప్తికరంగా అనిపించకపోతే, మారుతితో సెట్స్ పైకి వెళ్లాలనే ఆలోచనలో బన్నీ వున్నాడని చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ బన్నీ ఓకే చేసిన కథ మారుతి దగ్గర రెడీగా ఉండటమే అందుకు కారణమని అంటున్నారు.    
allu arjun
koratala

More Telugu News