కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని నన్నెవరూ అడగలేదు.. బీసీలే టీడీపీకి వెన్నెముక: అసెంబ్లీలో చంద్రబాబు
- కాపులకు న్యాయం చేయాలనేదే నా ఆలోచన
- ఇతర బీసీలకు అన్యాయం జరగదు
- రాష్ట్ర జనాభాలో కాపు, బలిజ, తెలగ, ఒంటరిలది 11 శాతం
ఇతర బీసీలకు అన్యాయం జరగకుండా కొత్తగా 'బీసీ ఎఫ్' ను ఏర్పాటు చేస్తున్నామని... 4 నుంచి 5 శాతం వరకు రిజర్వేషన్లు ఇవ్వచ్చని కమిషన్ సూచించగా, 5 శాతానికే మొగ్గు చూపామని చంద్రబాబు తెలిపారు. బీసీలు లేకుండా తెలుగుదేశం పార్టీనే లేదని ఆయన అన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానం చేసి, కేంద్రానికి పంపిస్తామని... కేంద్రం దీన్ని షెడ్యూల్ 9లో చేర్చి అమలు చేయాలని చెప్పారు.