Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త్వరలో రానా తమ్ముడి సినిమా లాంచ్ .. హాజరు కానున్న అగ్రహీరోలు!

  • తెలుగు తెరపైకి హీరోగా రానా తమ్ముడు 
  • భానుశంకర్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్ 
  • కథానాయికగా మాళవిక శర్మ 
  • ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి    
దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడు. సురేశ్ బాబు చిన్న కొడుకు .. రానా సోదరుడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా తెరకి పరిచయం కానున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. అభిరామ్ ను హీరోగా పరిచయం చేయడానికి సురేశ్ బాబు .. రానా కొంతకాలంగా కథలను వింటూ వస్తున్నారు.

 ఇటీవల భానుశంకర్ వినిపించిన కథ వాళ్లకి బాగా నచ్చిందట. దాంతో ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టడం .. పూర్తి చేయడం కూడా జరిగిపోయాయట. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించే ఈ సినిమాను .. త్వరలో రామానాయుడు స్టూడియోలో లాంచ్ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి టాలీవుడ్ అగ్ర హీరోలంతా హాజరవనున్నట్టుగా చెబుతున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో కథానాయికగా మాళవిక శర్మ కనిపించనుంది.   
abhiram
malavika sharma

More Telugu News