ఎయిమ్స్ లో సత్తా చాటిన గుంటూరు జిల్లా కుర్రాడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎయిమ్స్ లో సత్తా చాటిన గుంటూరు జిల్లా కుర్రాడు!

  • ఎయిమ్స్ ప్రవేశ పరీక్షలో ఫస్ట్ ర్యాంక్
  • రెండేళ్ల క్రితం ఎయిమ్స్ పీజీ పరీక్షలో మూడో ర్యాంక్
  • సత్తా చాటిన లంకా వివేక్
ఎయిమ్స్ లో సత్తా చాటిన ఏపీ కుర్రాడు లంకా వివేక్ తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని ఇనుమడింపజేశాడు. గుంటూరు జిల్లా పెదగొట్టిపాడు గ్రామానికి చెందిన వివేక్ ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) డీఎం న్యూరో రేడియాలజీ కోర్సు ప్రవేశ పరీక్షలో సత్తా చాటాడు. ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. దీంతో, ఖాళీగా ఉన్న ఏకైక సీటును సొంతం చేసుకున్నాడు. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే ఎయిమ్స్ పీజీ ప్రవేశ పరీక్షలో లంకా వివేక్ మూడో ర్యాంక్ సాధించాడు. అనంతరం రేడియాలజీ కోర్సులో చేరాడు. వచ్చే నెల ఈ పీజీ కోర్సు పూర్తి కానుంది.
lanka vivek
aiims

More Telugu News