రేపు రాత్రి ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు.. పోలవరంపై కేంద్ర మంత్రులతో భేటీ!
- సోమవారం జైట్లీ, గడ్కరీలతో భేటీ
- పోలవరంపై చర్చ
- ఏపీలో ప్రకంపనలు రేపుతున్న కేంద్రం లేఖ
మరోవైపు, ప్రతిపక్ష నేత జగన్ టీడీపీపై ఎదురుదాడి ప్రారంభించారు. పోలవరం సకాలంలో పూర్తి కాకపోవడానికి చంద్రబాబే కారణమంటూ ఆయన దుయ్యబడుతున్నారు. ఈ నేపథ్యంలో, కేంద్రంతో పోలవరంపై చర్చించేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నారు. రేపు రాత్రి ఆయన ఢిల్లీ బయల్దేరనున్నారు. సోమవారంనాడు ఆయన కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీలతో సమావేశం కానున్నారు. పోలవరం ప్రాజెక్టు నిధులకు సంబంధించి వీరితో చర్చించనున్నారు.