నేనిలా ఉండటానికి కోహ్లీనే కారణం: మిథాలీ రాజ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేనిలా ఉండటానికి కోహ్లీనే కారణం: మిథాలీ రాజ్

  • కోహ్లీ నాలో స్ఫూర్తిని నింపాడు
  • సోషల్ మీడియాతో మహిళా క్రికెట్ పాప్యులర్
  • ముందుకొస్తున్న ఔత్సాహిక యువతులు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రశంసలు కురిపించింది. తనలో కోహ్లీ ఎంతో స్ఫూర్తిని నింపాడని ఆమె తెలిపింది. తాను ఇంత గొప్పగా రాణించడానికి కోహ్లీనే కారణమని చెప్పింది. సీఎన్ఎన్-న్యూస్ 18 ఇండియన్ ఆఫ్ ది ఇయర్ - 2017లో మిథాలీ స్పెషల్ అచీవ్ మెంట్ అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది.

 మన దేశంలో మహిళా క్రికెట్ ఇంతగా పాప్యులర్ కావడానికి సోషల్ మీడియా ఎంతగానో ఉపయోగపడుతోందని చెప్పింది. అన్ని మ్యాచ్ లను లైవ్ లో చూపించడం కూడా కలిసొచ్చిందని తెలిపింది. ప్రస్తుతం ఎంతో మంది అమ్మాయిలు క్రికెట్ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పింది. 2005లో కూడా తాము ప్రపంచకప్ ఫైనల్ కు చేరామని... అయినా, అప్పుడు అంత ఆదరణ లభించలేదని తెలిపింది. మహిళల వన్డే క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ ఉమన్ గా మిథాలీ రికార్డులకెక్కిన విషయం తెలిసిందే.
mithali raj
virat kohli
team india

More Telugu News