ప్రపంచ రికార్డు ముంగిట కోహ్లీ.. మూడో టెస్ట్ గెలిస్తే ఆస్ట్రేలియా సరసన భారత్!
- ఢిల్లీ టెస్టు గెలిస్తే టీమిండియా ఖాతాలో అరుదైన రికార్డు
- వరుసగా 9 టెస్ట్ సిరీస్ విజయాలతో ఆసీస్‌ను సమం చేయనున్న కోహ్లీ సేన
- 5 వేల పరుగులకు మరో 25 పరుగుల దూరంలో కోహ్లీ
శ్రీలంకతో టెస్ట్, వన్డే, టీ20 సిరీస్ ముగిసిన అనంతరం భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. సఫారీలతో జరిగే టెస్ట్ సిరీస్‌లో కనుక టీమిండియా విజయం సాధిస్తే వరుసగా పది టెస్ట్ సిరీస్‌లు గెలుచుకున్న ఏకైక జట్టుగా భారత్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంటుంది.
స్కిప్పర్ కోహ్లీ ఖాతాలోనూ మరో అరుదైన రికార్డు వచ్చి చేరబోతోంది. మరో 25 పరుగులు చేస్తే టెస్టుల్లో కోహ్లీ 5 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా ఈ ఘనత అందుకున్న 11వ ఆటగాడు అవుతాడు. ఇప్పటి వరకు 62 టెస్టుల్లో 104 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ 4,975 పరుగులు సాధించాడు.