అనుభవాలే పాఠాలు .. ముందడుగు వేస్తూనే వుంటాను: నటి గౌతమి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అనుభవాలే పాఠాలు .. ముందడుగు వేస్తూనే వుంటాను: నటి గౌతమి

  • అనుకున్నది సాధించడానికి ప్రయత్నిస్తాను 
  • అందుకు ముందడుగు వేస్తాను 
  • ప్రతి పాఠం నుంచి లాభాన్ని పొందుతాను 
  • కేన్సర్ నుంచి ఆత్మ విశ్వాసాన్ని లాభంగా పొందాను  
నిన్నటితరం అందాల కథానాయికలలో 'గౌతమి' ఒకరు. తెరపై ఎన్నో మంచి పాత్రలను పోషించి శభాష్ అనిపించుకున్న గౌతమి, ఆ తరువాత వైవాహిక జీవితం పరంగాను .. ఆరోగ్యపరంగాను అనేక ఒడిదుడుకులను ఎదుర్కున్నారు. తాజాగా ఐ డ్రీమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. " నన్ను నేను అర్థం చేసుకోవడానికి .. పరిస్థితులకి తగినట్టుగా నన్ను నేను మార్చుకోవడానికే ఎక్కువ సమయం పట్టేసింది" అన్నారు.

 " ఏ విషయంలోనైనా ఒక విధంగా ముందుకు వెళ్లడానికే చూస్తాను. అలా 'గోల్' చేరుకోలేనప్పుడు మరో మార్గం ద్వారా అనుకున్నది సాధించడానికి ప్రయత్నిస్తాను. అలా ముందడుగు వేస్తూ వెళుతుంటాను తప్ప .. వెనకడుగు వేయను. ఇంతవరకూ వెనకడుగు వేయవలసిన అవసరం రాలేదు. నేను నేర్చుకున్న ప్రతి పాఠం నుంచి .. ప్రతి అనుభవం నుంచి నేను ఏదో ఒక లాభం పొందాలి. కేన్సర్ రావడం వలన .. దాని నుంచి నేను ఆత్మవిశ్వాసాన్ని లాభంగా పొందగలిగాను. ఆ ఆత్మ విశ్వాసాన్ని ఎంతోమందిలో పెంపొందించడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.  
gautami

More Telugu News