రామ్ జోడీగా నివేద థామస్ ను ఓకే చేశారట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రామ్ జోడీగా నివేద థామస్ ను ఓకే చేశారట!

  • త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రామ్ 
  • సెట్స్ పైకి వెళ్లడానికి జరుగుతోన్న సన్నాహాలు 
  • నివేద థామస్ దగ్గర ఆగిన అన్వేషణ 
  • ఆల్రెడీ ఆమె ఖాతాలో రెండు హిట్లు  
'హైపర్' పరాజయం తరువాత తన నెక్స్ట్ సినిమాకి రామ్ చాలా సమయం తీసుకున్నాడు. అలా ఆయన చేసిన 'ఉన్నది ఒకటే జిందగీ' కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. అయితే ఈసారి మాత్రం ఆయన తన తదుపరి సినిమాకి ఎక్కువ సమయాన్ని తీసుకోవడం లేదు. వెంటనే మరో సినిమాతో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు.

త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో .. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు జరిగిపోతున్నాయి. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కొంతమంది హీరోయిన్ల పేర్లను పరిశీలించారట. చివరికి నివేదా థామస్ ను ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. 'జెంటిల్ మేన్' .. నిన్నుకోరి' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నివేద థామస్, ఈ సినిమాలోని పాత్రకి కరెక్ట్ గా సరిపోతుందని భావిస్తున్నారట. ఇక ఈ జోడీ ఎలా ఉంటుందో తెరపై చూడాలనే కుతూహలం అభిమానులకు కలగడం సహజం.   
ram
Niveda Thomas

More Telugu News