సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • తనకు టార్గెట్స్ లేవంటున్న సమంత 
  • గోవాలో అల్లు అర్జున్ షూటింగ్ 
  • కన్నడలో 'రారండోయ్..' రీమేక్
  • రిలీజ్ డేట్ పెట్టుకున్న '2 కంట్రీస్'
*  తనకెప్పుడూ కూడా పెద్దగా టార్గెట్స్ అంటూ లేవని అంటోంది అందాలతార సమంత. "సినిమాల్లోకి వచ్చినప్పుడు కూడా నాకు పెద్దగా టార్గెట్స్ లేవు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెళ్లిపోయాను. ఇప్పుడూ అంతే.. వచ్చిన వాటిలో మనసుకు నచ్చినవి చేస్తాను" అని చెప్పింది సమంత        
*  అల్లు అర్జున్ హీరోగా రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'నా పేరు సూర్య' చిత్రం షూటింగ్ ఇటీవల ఊటీలో జరిగింది. తాజా షెడ్యూలు షూటింగును నేటి నుంచి గోవాలో నిర్వహిస్తారు. ఇందులో అనూ ఇమ్మానుయేల్ కథానాయికగా నటిస్తోంది.
*  నాగ చైతన్య, రకుల్ జంటగా వచ్చిన 'రారండోయ్ వేడుక చూద్దాం' చిత్రాన్ని కన్నడలో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 'జాగ్వార్' సినిమా ద్వారా పరిచయమైన నిఖిల్ గౌడ ఇందులో హీరోగా నటిస్తాడు.  
*  హాస్య కథానాయకుడు సునీల్ హీరోగా ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన '2 కంట్రీస్' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వచ్చే నెల 29న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని చిత్ర నిర్మాత తెలిపారు. మనీషా రాజ్ కథానాయికగా నటించిన ఈ చిత్రం షూటింగ్ ఎక్కువగా అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది.  
Samantha
Allu Arjun
rakul
sunil

More Telugu News