ఇవాంకా డ్రెస్‌లపై ఎడతెగని చర్చ.. ధరపై ఊహాగానాలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇవాంకా డ్రెస్‌లపై ఎడతెగని చర్చ.. ధరపై ఊహాగానాలు!

  • ఒకే రోజు మూడు డ్రెస్‌లు ధరించిన ఇవాంకా
  • వాటి ఖరీదుతో ఓ కారు కొనుక్కోవచ్చంటూ విశ్లేషణ
  • ఇప్పుడిదే హాట్ టాపిక్
హైదరాబాద్‌లో రెండు రోజులపాటు నిర్వహించిన అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సుకు హాజరైన ఇవాంకా ట్రంప్ బుధవారం రాత్రి అమెరికా వెళ్లేందుకు అరబ్ ఎమిరేట్స్ ఫ్లైట్ ఎక్కేశారు. ఆమె రాకకు ముందు ఎక్కడ చూసినా ఆమె గురించే చర్చ. ఇప్పుడు ఆమె వెళ్లిపోయిన తర్వాత కూడా చర్చ కొనసాగుతోంది. అయితే, ఈసారి చర్చ ఆమె ధరించిన డ్రెస్‌లపైన కావడం విశేషం!

వీటి ధర ఎంత ఉంటుందన్న చర్చ తొలుత జాతీయ మీడియాలో మొదలైంది. ఇవాంకా విమానం దిగిన దగ్గరి నుంచి ఫలక్‌నుమాలో కేంద్రం ఇచ్చిన డిన్నర్‌కు హాజరయ్యే లోపు మొత్తం మూడు రకాల డ్రెస్‌లు ధరించారు. వీటి మొత్తం ధర భారత కరెన్సీలో రూ.5.50 లక్షలని జాతీయ మీడియా పేర్కొంది.

శంషాబాద్ విమానాశ్రయంలో దిగినప్పుడు ఇవాంకా ముత్యాలు పొదిగిన డ్రెస్ ధరించారు. దాని ఖరీదు 1,298 డాలర్లని, సదస్సుకు హాజరైనప్పుడు వేసుకున్న గ్రీన్ కలర్ డ్రెస్ ఖరీదు 3,550 డాలర్లని తెలుస్తోంది. ఫలక్‌నుమాలో విందుకు హాజరైనప్పుడు ధరించిన డ్రెస్ ఖరీదు 3498 డాలర్లు అని సమాచారం. వీటి మొత్తం విలువ 8,346 డాలర్లు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.5.50 లక్షలన్నమాట. ఈ సొమ్ముతో చిన్న కారు ఒకటి కొనుక్కోవచ్చన్నమాట!
Ivanka Trump
Hyderabad
Dress

More Telugu News