గుజరాత్ ఎన్నికల ప్రచారం: కొత్త వివాదంలో రాహుల్ గాంధీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గుజరాత్ ఎన్నికల ప్రచారం: కొత్త వివాదంలో రాహుల్ గాంధీ!

  • నాన్‌- హిందూ లిస్టులో త‌న పేరుని రాసిన రాహుల్ గాంధీ
  • గుజ‌రాత్‌లోని సోమ్‌నాథ్ దేవాల‌యంలో ఘ‌ట‌న‌
  • రాహుల్‌పై బీజేపీ విమ‌ర్శ‌లు
  • ఓట్ల‌కోస‌మే రాహుల్ గుడుల చుట్టూ తిరుగుతున్నార‌ని ఆరోప‌ణ‌లు
గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌చారం చేస్తూ బిజీబిజీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ వివాదంలో చిక్కుకున్నారు. కొన్ని రోజులుగా దేవాల‌యాల‌కు వెళ్లి పూజ‌ల్లో పాల్గొంటోన్న రాహుల్ గాంధీపై ఇప్ప‌టికే బీజేపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. త‌మ పార్టీపై ఉన్న‌ హిందూ వ్య‌తిరేక ముద్ర‌ను కప్పిపుచ్చుకోవ‌డానికే ఆయ‌న దేవాల‌యాల‌కు వెళ్తున్నార‌ని అంటున్నారు.

కాగా, ఈ రోజు గుజరాత్‌లోని సోమ‌నాథ్ దేవాల‌యానికి వెళ్లిన రాహుల్ గాంధీ.. ఎంట్రీ బుక్ లో తన పేరును నాన్‌-హిందూ విజిట‌ర్‌ల లిస్టులో పేర్కొన్నారు. రాహుల్ గాంధీ తీరుపై బీజేపీ నేత‌లు విమ‌ర్శ‌ల దాడి మొద‌లుపెట్టారు. ఓట్ల‌ కోస‌మే రాహుల్ గుడుల చుట్టూ తిరుగుతున్నార‌ని అంటున్నారు.

   
rahul gandhi
hindu
BJP
Congress

More Telugu News