Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గోల్కొండ కోటలో చప్పట్లు కొట్టి ముచ్చటపడిన ఇవాంకా ట్రంప్!

  • గోల్కొండ కోటను సందర్శించిన ఇవాంకా ట్రంప్
  • ఇవాంకా కోసం బ్యాటరీ కారు ఏర్పాటు 
  • నడుస్తూ కోట సందర్శన
నిజాముల చారిత్రక వారసత్వ సంపద గోల్కొండ కోటను అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్ సందర్శించారు. ఈ కోట విశిష్టతను మహిళా గైడ్ ఇవాంకాకు వివరించారు. కోటను సందర్శించేందుకు ఇవాంకా కోసం ప్రత్యేకంగా బ్యాటరీ కారు ఏర్పాటు చేసినప్పటికీ ఆమె కాలినడకన కోటను సందర్శించడం విశేషం.

ఈ సందర్భంగా కోటలోని రాజప్రాసాదంలో రాజ సేవకులు, సందర్శకులను పిలిచే విధానాన్ని వివరించగా, అక్కడ ఇవాంకా చప్పట్లు కొట్టి ముచ్చటపడింది. అనంతరం కోట మధ్యలో నిలబడి గట్టిగా శబ్దం చేస్తే అది ప్రతిధ్వనించి తిరిగి మనకే చేరుతుందని తెలుపగా, ఇవాంకా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  
ivanka
golkonda fort

More Telugu News