'ఆటా నాదే వేటా నాదే'లో వెంకటేశ్ కి బావ పాత్రలో రాజశేఖర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఆటా నాదే వేటా నాదే'లో వెంకటేశ్ కి బావ పాత్రలో రాజశేఖర్!

  • తేజ దర్శకత్వంలో 'ఆటా నాదే వేటా నాదే'
  • కథానాయకుడిగా వెంకటేశ్ 
  • కీలకమైన పాత్రలో రాజశేఖర్ 
  • వెంకీ పుట్టిన రోజున ప్రారంభం
తేజ దర్శకత్వంలో వెంకటేశ్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'ఆటా నాదే వేటా నాదే' అనే టైటిల్ ను ఖరారు చేసే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. వచ్చేనెల 13వ తేదీన వెంకటేశ్ పుట్టినరోజున ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. ఇంతవరకూ చేయని పాత్రలో వెంకటేశ్ కనిపించనున్నారని చెబుతున్నారు.

 ఈ సినిమాలో వెంకటేశ్ కి బావగా మరో కీలకమైన పాత్ర ఉందట. ఈ పాత్ర కోసం రాజశేఖర్ ను తీసుకున్నట్టుగా సమాచారం. రాజశేఖర్ కి తేజ కథ చెప్పడం .. ఆయన ఓకే చెప్పేయడం ఆల్రెడీ జరిగిపోయాయట. పవన్ కల్యాణ్ .. మహేశ్ బాబు .. రామ్ తో మల్టీ స్టారర్ మూవీస్ చేసిన వెంకటేశ్, రాజశేఖర్ తో కలిసి ఈ సినిమా చేస్తుండటం విశేషం. ఇక తేజతో 'నేనే రాజు నేనే మంత్రి' రాజశేఖర్ చేయాల్సింది .. కానీ కుదరలేదు. పెద్ద గ్యాప్ లేకుండానే ఈ కాంబినేషన్ మళ్లీ సెట్ కావడం మరో విశేషం.      
venkatesh
rajasekhar

More Telugu News