ఎగురుతున్న విమానంలోకి ఎగురుతూ దూకారు... అబ్బుర‌ప‌రుస్తున్న విన్యాసం... వీడియో చూడండి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎగురుతున్న విమానంలోకి ఎగురుతూ దూకారు... అబ్బుర‌ప‌రుస్తున్న విన్యాసం... వీడియో చూడండి

  • సినిమాను త‌ల‌పిస్తున్న విన్యాసం
  • ఎత్తైన ప‌ర్వ‌తం మీద నుంచి దూకిన ఇద్ద‌రు ఫ్రాన్స్‌ సాహసికులు
  • వింగ్ సూట్స్ స‌హాయంతో విన్యాసం పూర్తి
ప‌ర్వ‌తం మీద నుంచి వింగ్ సూట్ వేసుకుని దూక‌డ‌మే ఒక సాహ‌సం... అలాంటిది వింగ్ సూట్స్‌తో ఎగురుతూ, ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానంలోకి దూక‌డం అంటే... సాహ‌సాల‌కే సాహ‌సం. ఇలాంటి విన్యాసాలు సినిమాల్లో మాత్ర‌మే జ‌రుగుతాయ‌నుకుంటున్నారా?... కానీ ఈ విన్యాసాన్ని ఫ్రాన్స్‌కి చెందిన ఇద్ద‌రు సాహ‌సికులు నిజ‌జీవితంలో కూడా పూర్తి చేశారు. యూర‌ప్‌లోని అతిపెద్ద ప‌ర్వ‌తాల్లో ఒక‌టైన జంగ్‌ఫ్రా ప‌ర్వ‌తం మీద నుంచి దూకి... అలా గాల్లో ఎగురుతూ వారి ప‌క్క‌గా ప్ర‌యాణిస్తున్న విమానంలోకి చేరుకున్నారు.

ఈ విన్యాసం వీడియోను 'రెడ్ బుల్' త‌మ యూట్యూబ్ పేజీలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో క‌నిపించిన ఇద్ద‌రూ సాహ‌సికుల పేర్లు ఫ్రెడ్ ఫ్యూజ‌న్‌, విన్స్ రిఫెట్‌. అయితే ఈ సాహ‌సాన్ని క‌చ్చితత్వంతో చేయ‌డానికి ముందు దాదాపు 20 సార్లు ప్రాక్టీస్ చేసిన‌ట్లు వారు తెలిపారు.

flight
stunt
aeroplane
alps
jungfraun
mountain

More Telugu News