వైర‌ల్ వీడియో: ఓర్లాండోలో ఎన్‌బీఏ బాస్కెట్‌బాల్ గేమ్స్‌లో 'బాహుబ‌లి' పాట డ్యాన్స్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వైర‌ల్ వీడియో: ఓర్లాండోలో ఎన్‌బీఏ బాస్కెట్‌బాల్ గేమ్స్‌లో 'బాహుబ‌లి' పాట డ్యాన్స్

  • 'బాహుబ‌లి' హిందీ పాట‌కు డ్యాన్స్ చేసిన బాలిక‌లు
  • ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఎన్‌బీఏ
  • విప‌రీతంగా షేర్ చేస్తున్న అభిమానులు
'బాహుబ‌లి' సినిమాల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులు ఉన్నార‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. అందుకు మ‌రో ఉదాహర‌ణగా, ఇటీవ‌ల అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండోలో జరిగిన ఎన్‌బీఏ బాస్కెట్‌బాల్ గేమ్స్ ప్రారంభ‌ వేడుక‌ను చెప్పుకోవచ్చు. భార‌త సంప్ర‌దాయం ఉట్టిప‌డేలా వ‌స్త్రాలు ధ‌రించి 'బాహుబ‌లి' చిత్రాల్లోని పాటల‌కు బాలిక‌లు చేసిన నృత్యం అంద‌రినీ ఆకట్టుకుంది. ఆ వీడియోను ఎన్‌బీఏ త‌మ అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. పోస్ట్ చేసిన కొద్దిసేపటికే అభిమానులు ఆ వీడియోను వైర‌ల్‌గా మార్చారు.

baahubali
nba
orlando

More Telugu News