చిరూ .. రవితేజ .. నాని మాదిరిగానే సాయిధరమ్ తేజ్: బీవీఎస్ రవి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిరూ .. రవితేజ .. నాని మాదిరిగానే సాయిధరమ్ తేజ్: బీవీఎస్ రవి

  • జయాలు .. పరాజయాలు సహజం
  • ప్లాప్ సినిమాలు వచ్చినంత మాత్రాన ఆ హీరోను వదులుకోరు
  • సాయిధరమ్ తేజ్ కి ఈ సినిమాతో హిట్ పడుతుంది
సాయిధరమ్ తేజ్ ఇంతకుముందు చేసిన 'తిక్క' .. 'విన్నర్' .. పరాజయం పాలయ్యాయి. ఆ తరువాత సినిమాగా ప్రేక్షకుల ముందుకు 'జవాన్' వస్తోంది. సాయిధరం తేజ్ ఇచ్చిన ప్లాప్స్ గురించి దర్శకుడు బీవీఎస్ రవి మాట్లాడుతూ .. "ఒక హీరోను ప్రేక్షకులు అభిమానించడం మొదలుపెట్టిన తరువాత, పరాజయాలు వచ్చాయి కదా అని వెంటనే ఆ హీరోను వదిలేయడం జరగదు" అన్నారు.

 "చిరంజీవి గారు వున్నారు .. ఎన్నో సూపర్ హిట్స్ తరువాత ఆయనకి 'రాజా విక్రమార్క' 'స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్'లతో పరాజయాలు ఎదురయ్యాయి. ఆ తరువాత 'గ్యాంగ్ లీడర్' .. 'రౌడీ అల్లుడు' .. 'ఘరానా మొగుడు' సినిమాలతో బ్లాక్ బస్టర్స్ కొట్టారు. అలాగే రవితేజ కూడా ప్లాప్ లను ఎదుర్కుంటూ వచ్చి 'రాజా ది గ్రేట్' తో ఘన విజయాన్ని అందుకున్నాడు. నాని కూడా ప్లాప్ లను చవి చూసి .. ఆ తరువాత వరుస హిట్లు అందుకుంటున్నాడు. అలాగే సాయిధరం తేజ్ రెండు ప్లాప్ లు ఇచ్చినా .. ఈ సినిమాతో హిట్ కొడతాడనే నమ్మకం నాకు వుంది" అంటూ చెప్పుకొచ్చారు. 
saidharam tej
bvs ravi

More Telugu News