జ‌హీర్ ఖాన్ - సాగ‌రిక‌ల రిసెప్ష‌న్‌లో విరాట్‌, అనుష్క‌ల డ్యాన్స్‌... వీడియో చూడండి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జ‌హీర్ ఖాన్ - సాగ‌రిక‌ల రిసెప్ష‌న్‌లో విరాట్‌, అనుష్క‌ల డ్యాన్స్‌... వీడియో చూడండి

  • స్టెప్పులు వేసిన ఇరు జంట‌లు
  • వైర‌ల్ అవుతున్న వీడియో
  • సంద‌డిగా జరిగిన రిసెప్ష‌న్
విరాట్ - అనుష్క శ‌ర్మ‌ జంటను అభిమానులు ముద్దుగా విరుష్క అని పిలుచుకుంటారు. వీరిద్ద‌రూ ఎక్క‌డికి వెళ్లినా అంద‌రి దృష్టినీ త‌మ వైపే ఆక‌ర్షిస్తుంటారు. అది టీవీ ప్ర‌క‌ట‌నైనా లేక హాలీడే ట్రిప్ అయినా... ఏది చేసినా వాళ్ల మ‌ధ్య ఉన్న బంధం కొట్టొచ్చిన్న‌ట్లు క‌నిపిస్తుంటుంది. ఇటీవ‌ల జరిగిన జహీర్ ఖాన్ - సాగ‌రిక రిసెప్ష‌న్‌కి వారు హాజ‌ర‌య్యారు. అక్క‌డ కూడా త‌మ‌దైన శైలిలో అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు.

ఆ రిసెప్ష‌న్ లో వారిద్ద‌రూ క‌లిసి పెళ్లి జంట‌తో చేసిన డ్యాన్స్ వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. బాలీవుడ్ పాట‌ల‌కు విరుష్క‌, జ‌హారిక జంట‌లు స్టెప్పులు వేయ‌డం ఇందులో ఉంది. విరాట్ ఇలా రిసెప్ష‌న్‌లో సంద‌డి చేయ‌డం ఇదేం మొద‌టిసారి కాదు... గ‌తంలో యువ‌రాజ్ - హ‌జ‌ల్ కీచ్‌ల రిసెప్ష‌న్‌లో కూడా విరాట్ డ్యాన్స్‌లు వేశాడు.
Virat Kohli
Anushka Sharma
zahir khan
sagarika

More Telugu News