Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఫీచర్!

  • యూట్యూబ్ వీడియోలు వాట్సాప్‌లోనే చూసుకునే అవకాశం
  • చాట్ చేస్తూనే వీడియో వీక్షించే సదుపాయం
  • యూట్యూబ్‌లోకి వెళ్లే బాధ తప్పినట్టే
మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌తో యూజర్ల ముందుకు వచ్చేసింది. స్నేహితులు పంపే యూట్యూబ్ వీడియోను వీక్షిస్తూనే చాట్‌ను కొనసాగించే అవకాశాన్ని కల్పించేలా సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. గతంలో ఎవరైనా యూట్యూబ్ వీడియోలను పంపితే అది యూట్యూబ్ యాప్‌లో ప్లే అయ్యేది. ఫలితంగా యూజర్లు తప్పనిసరిగా యూట్యూబ్‌లోకి వెళ్లాల్సి వచ్చేది.

ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఫీచర్‌ వల్ల వాట్సాప్‌ను వీడకుండానే యూట్యూబ్ వీడియోలను వీక్షించేందుకు అవకాశం యూజర్లకు లభించింది. చాట్ చేస్తూనే అక్కడే ఆ వీడియోను ప్లే చేసి చూసుకోవచ్చు. ఐవోఎస్ వినియోగదారుల కోసమే ఈ ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది.
Youtube
Whatsapp
video

More Telugu News