ఇవాంకా మాటతీరుకు ఆహూతులు ఫిదా.. ఆహార్యంలో అదరహో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇవాంకా మాటతీరుకు ఆహూతులు ఫిదా.. ఆహార్యంలో అదరహో!

  • అందం, ఆహార్యంతో అందరినీ ఆకట్టుకున్న ఇవాంకా
  • చెప్పాల్సిన విషయాన్ని సూటిగా, అందంగా చెప్పిన వైనం
  • అభిమానులుగా మారిపోయిన ఆహూతులు
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన శ్వేతసౌధ సలహాదారు ఇవాంకా ట్రంప్‌ అందరినీ ఆకట్టుకున్నారు. అందం, ఆహార్యంతోపాటు ఆమె మాటతీరుకు సదస్సుకొచ్చినవారు ఫిదా అయిపోయారు. అణువణువునా ఆత్మవిశ్వాసం, తీరైన నడక, ముఖంపై చెరగని చిరునవ్వును చూసి ఆహూతులు అభిమానులుగా మారిపోయారు. ఆమె ప్రసంగాన్ని టీవీల్లో వీక్షించిన వారు కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.

ఇవాంకా తన ప్రసంగాన్ని ప్రారంభించినప్పుడే ఆమెలోని గొప్పతనం అందరికీ అర్థం అయింది. ‘‘హలో ఎవ్రీవన్, థ్యాంక్యూ బీయింగ్ హియర్ అండ్ ఫర్ ఇన్‌క్రెడిబుల్లీ వార్మ్ వెల్‌కమ్’’ అంటూ అందరి హృదయాలను గెలుచుకున్నారు. భారత్-అమెరికా మధ్య ఉన్న అనుబంధాన్ని చక్కగా వివరించారు. ఎక్కడ ఏ పదం ఉపయోగించాలో అదే ఉపయోగిస్తూ అందరినీ తనవైపు తిప్పుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే సూటిగా, అందంగా మాట్లాడారని పరిశీలకులు చెబుతున్నారు. అందరినీ కళ్లతోనే పలకరిస్తూ చేసిన ప్రసంగం అద్భుతంగా ఉందని అంటున్నారు. మంచి వక్తలా మాట్లాడారని విశ్లేషిస్తున్నారు.
Ivanka Trump
Hyderabad
GES

More Telugu News