ఇవాంకా ట్రంప్ చార్మినార్ పర్యటన రద్దు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇవాంకా ట్రంప్ చార్మినార్ పర్యటన రద్దు

  • చార్మినార్, గోల్కొండల్లో ఇవాంకాను పర్యటింపజేయాలని బావించిన టీఎస్ ప్రభుత్వం
  • చార్మినార్ కు ఇవాంకా రాదని స్పష్టం చేసిన అమెరికా సెక్యూరిటీ
  • గోల్కొండలో పర్యటించనున్న ఇవాంకా
హైదరాబాద్ లో జరుగుతున్న జీఈ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ నగరానికి విచ్చేశారు. ట్రైడెంట్ హోటల్ లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆమె బస చేశారు. హైదరాబాదుకు తొలిసారి విచ్చేసిన ఇవాంకకు నగర అందాలను చూపించాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా చేసింది.

చార్మినార్, గోల్కొండ ప్రాంతాల్లో పర్యటింపజేయించాలని, పాతబస్తీ గాజుల మార్కెట్లో షాపింగ్ చేయించాలని ఏర్పాట్లు చేసింది. అయితే, అమెరికా భద్రతా విభాగం దీనికి అంగీకరించలేదు. భద్రతా కారణాల వల్ల పాతబస్తీలో ఉన్న చార్మినార్ ను చూసేందుకు ట్రంప్ రావడం లేదని వారు స్పష్టం చేశారు. అయితే, రేపు మధ్యాహ్నం మాత్రం గోల్కొండ కోటను చూసేందుకు వెళతారని చెప్పారు.
ivanka trump
charminar
golkonda

More Telugu News