వేలానికి సిద్ధంగా ప్రిన్సెస్ డ‌యానా 'వెడ్డింగ్ కేకు' ముక్క‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వేలానికి సిద్ధంగా ప్రిన్సెస్ డ‌యానా 'వెడ్డింగ్ కేకు' ముక్క‌!

  • అది 36 ఏళ్ల కింద‌టి కేకు
  • 800 డాల‌ర్ల‌కు అమ్ముడ‌వుతుంద‌ని అంచ‌నా
  • వేలంలో ఉంచిన ఆర్ఆర్ ఆక్ష‌న్స్‌
1981 జూలై 29న జ‌రిగిన ప్రిన్సెస్ డ‌యానా, ప్రిన్స్ చార్లెస్‌ల వెడ్డింగ్ కేకులో ఒక ముక్క‌ను అమెరికాకు చెందిన ఆర్ఆర్ ఆక్ష‌న్స్ వేలానికి ఉంచింది. 36 ఏళ్ల కింద‌టి ఈ ముక్క‌ను బ‌కింగ్‌హ‌మ్ ప్యాలెస్ చిరునామాతో ఉన్న కేకు బాక్సులో దీన్ని ఉంచారు. దీంతో పాటు వేల్స్ రాజ‌వంశీయులు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఇచ్చిన కార్డు కూడా ఉంటుంది. ఇదే కార్డును అప్పుడు పెళ్లికి హాజ‌రైన వారికి ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

అయితే వారి వెడ్డింగ్ కేకులో ఒక చిన్న భాగ‌మైన ఈ కేకు ముక్క దాదాపు 800 డాల‌ర్ల వ‌ర‌కు అమ్ముడ‌వుతుంద‌ని ఆర్ఆర్ ఆక్ష‌న్స్ వారు అంచనా వేస్తున్నారు. ఈ కేకును రాయ‌ల్ నావ‌ల్ కుకింగ్ స్కూల్‌కి చెందిన డేవిడ్ ఏవ‌రీ త‌యారుచేశారు. దీంతో పాటు వారి పెళ్లి వేడుక‌లో ఉప‌యోగించిన చాలా వ‌స్తువులు, లేఖ‌లు, ఫొటోల‌ను కూడా ఈ వేలంలో ఉంచారు. వీటిలో ప్రిన్సెస్ డ‌యానా ఉప‌యోగించిన ర‌త్నాలు పొదిగిన బ్యాగు ఎక్కువ ధ‌ర ప‌లుకుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.
auction
princess diana
prince charles

More Telugu News