ఇవాంకా పేరుతో గాజులు.. చార్మినార్ వ‌ద్ద వ్యాపారం ప్రారంభం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇవాంకా పేరుతో గాజులు.. చార్మినార్ వ‌ద్ద వ్యాపారం ప్రారంభం!

  • గాజుల‌పై భార‌త్, అమెరికా జాతీయ జెండాలు
  • ఆక‌ర్షిస్తున్న గాజులు
  • చార్మినార్ వ‌ద్ద షాపింగ్ చేయ‌నున్న ఇవాంకా?
ఇవాంకా రావ‌డానికి మునుపే హైద‌రాబాద్‌లో హ‌డావుడి మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ఆమె చార్మినార్ వ‌ద్ద షాపింగ్ చేయ‌నుంద‌ని వ‌చ్చిన వార్తలు విన్న వ్యాపార‌స్తులు త‌మ సృజ‌నాత్మ‌క‌త‌కు ప‌దును పెట్టి ప్ర‌త్యేక డిజైన్ల‌తో గాజులు త‌యారు చేశారు. ప్ర‌స్తుతం చార్మినార్ దగ్గ‌రి లాడ్‌బ‌జార్‌లో ఇవాంకా పేరుతో ఉన్న‌ గాజులు అంద‌రినీ ఆక‌ర్షిస్తున్నాయి.

అంతేకాకుండా భార‌త‌, అమెరికా జాతీయ జెండాల‌తో గాజులపై డిజైన్లు వేసి అమ్ముతున్నారు. ఆమె ఇక్క‌డ షాపింగ్ చేస్తుందో లేదో స్ప‌ష్ట‌త లేదు కానీ ఆమె పేరుతో వ్యాపారం మాత్రం జోరుగానే సాగుతున్న‌ట్లు తెలుస్తోంది.
ivanka trump
charminar
bangles

More Telugu News