బోనులోంచి దూసుకొచ్చిన పులి.. భ‌యంతో వ‌ణికిపోయిన జ‌నం.. వీడియో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బోనులోంచి దూసుకొచ్చిన పులి.. భ‌యంతో వ‌ణికిపోయిన జ‌నం.. వీడియో!

  • నార్త్ చైనాలోని షాంక్షి ప్రాంతంలో ఘ‌ట‌న‌
  • సర్కస్ షో జరుగుతోన్న ప్రాంతానికి భారీ ఎత్తున జ‌నం
  • బోనుకు ఉన్న లాక్ స‌రిగ్గా లేక‌పోవ‌డంతో బ‌య‌ట‌కొచ్చిన పులి
  • ఇద్ద‌రు చిన్నారుల‌కు గాయాలు
నార్త్ చైనాలోని షాంక్షి ప్రాంతంలో కొంత మంది ప్ర‌జ‌లు పెను ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. సర్కస్ షో జరుగుతోన్న ప్రాంతానికి భారీ ఎత్తున జ‌నం వ‌చ్చారు. అక్క‌డ‌ బోనులో ఉన్న పులులతో స‌ర్కస్ వారు స్టంట్స్ చేయిస్తున్నారు. అక్క‌డి వారంతా ఆ ప్ర‌ద‌ర్శ‌న‌ను ఆస‌క్తిగా చూస్తున్నారు. అదే స‌మ‌యంలో ఆ బోనులోంచి ఓ పులి తప్పించుకొని బయటికి వచ్చేసింది. బోనుకు ఉన్న లాక్ స‌రిగ్గా లేక‌పోవ‌డమే ఇందుకు కార‌ణం. ఒక్క‌సారిగా జ‌నం వ‌ణికిపోయారు. ప‌రుగెత్తుకు వ‌చ్చిన‌ పులి ఇద్దరు చిన్నారులను గాయపర్చింది. స‌ర్క‌స్ సిబ్బంది వెంట‌నే పులిని పట్టుకొని తిరిగి బోనులోకి పంపించడంతో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది. గాయ‌ప‌డ్డ చిన్నారుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు.  

 
China
Shanxi Province
tiger

More Telugu News