వచ్చే ఏడాది ప్రిన్స్ హ్యారీ, మేఘ‌న్ మార్కెల్‌ ల వివాహం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వచ్చే ఏడాది ప్రిన్స్ హ్యారీ, మేఘ‌న్ మార్కెల్‌ ల వివాహం!

  • అధికారికంగా ప్ర‌క‌టించిన ప్రిన్స్ ఛార్లెస్‌
  • ఇటీవ‌ల నిశ్చితార్థం కూడా జ‌రిగింద‌ని వెల్ల‌డి
  • నాటింగ్‌హామ్ కాటేజ్‌లో నివ‌సించ‌నున్న జంట‌
సెప్టెంబ‌ర్ నెల‌లో ఇన్‌విక్ట‌స్ గేమ్స్ వ‌ద్ద‌ ప్రిన్స్ హ్యారీ, న‌టి మేఘ‌న్ మార్కెల్‌ల‌ను జంట‌గా చూసిన వాళ్లంతా వీళ్లిద్ద‌రి మ‌ధ్య ఏదో జ‌రుగుతోంద‌ని అనుకున్నారు. ఇప్పుడు అదే నిజ‌మైంది... వచ్చే ఏడాది వీళ్లిద్ద‌రూ వివాహం చేసుకోబోతున్న‌ట్లు అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. అంతేకాదు న‌వంబ‌ర్ మొద‌టి వారంలో లండ‌న్‌లో వీరిద్ద‌రికీ నిశ్చితార్థం కూడా పూర్త‌యిన‌ట్లు ప్రిన్స్ హ్యారీ తండ్రి ప్రిన్స్ చార్లెస్ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు.

వీరిద్ద‌రూ క‌లిసి నాటింగ్‌హామ్ కాటేజ్‌లో నివ‌సించ‌నున్నార‌ని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. వీరి పెళ్లికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాల‌ను త్వ‌ర‌లో వెల్ల‌డిస్తామ‌ని తెలిపారు. 'సూట్స్' టీవీ షోలో రేచ‌ల్ జేన్ పాత్ర ద్వారా ప్రాచుర్యం సంపాదించుకున్న మేఘ‌న్ మార్కెల్, ప్రిన్స్ హ్యారీ కంటే మూడేళ్లు పెద్ద‌. అంతేకాదు ఇప్ప‌టికే ఒకరిని పెళ్లి చేసుకుని, విడాకులు కూడా తీసుకుంది.
prince harry
meghan markel
marriage
engagement

More Telugu News