నాగ్ పూర్ టెస్ట్ లో ఇండియా విజయం: భారత టెస్ట్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన కోహ్లీ సేన!
- శ్రీలంకపై ఇన్నింగ్స్, 239 పరుగుల తేడాతో విజయం
- శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 205, రెండో ఇన్నింగ్స్ 166
- భారత్ తొలి ఇన్నింగ్స్ 610/6 డిక్లేర్డ్
- మూడు టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యంలో భారత్
21/1 ఓవర్నైట్ స్కోరుతో ఈ రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన లంక బ్యాట్స్మెన్ భారత బౌలర్ల ధాటికి మైదానంలో నిలవలేకపోయారు. సమరవిక్రమ, పెరీరా, హెరాత్, గ్యామెజ్ ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుదిరగగా, కరుణరత్నే 18, తిరిమన్నే 23, మ్యాథ్యూస్ 10, డిక్ వెల్లా 4, షనక 17, లక్మల్ 31 పరుగులు చేసి అవుట్ అయ్యారు. చండిమల్ (61) చేసిన ఒంటరి పోరాటం వృథా అయింది. దీంతో మూడు టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యంలో భారత్ నిలిచింది.