కేఆర్‌కే మ‌ళ్లీ వ‌చ్చాడు.. కానీ ఎక్కువ సేపు ఉండ‌లేదు.. కొత్త‌ ఖాతాను కూడా నిలిపివేసిన ట్విట్ట‌ర్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేఆర్‌కే మ‌ళ్లీ వ‌చ్చాడు.. కానీ ఎక్కువ సేపు ఉండ‌లేదు.. కొత్త‌ ఖాతాను కూడా నిలిపివేసిన ట్విట్ట‌ర్‌!

  • ఖాన్ త్ర‌యాన్ని విమ‌ర్శిస్తూ ట్వీట్లు చేసిన బాలీవుడ్ విమ‌ర్శ‌కుడు
  • అక్టోబ‌ర్ 18న పాత ఖాతాను నిలిపివేసిన ట్విట్ట‌ర్‌
  • ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని బెదిరించినా క‌నిక‌రించ‌ని ట్విట్ట‌ర్‌
బాలీవుడ్ సినిమాల‌ను దుబాయ్‌లో చూసి, ఇష్టం వ‌చ్చిన‌ట్లు ట్విట్ట‌ర్‌లో సమీక్ష‌లు రాసే క‌మ‌ల్ ర‌షీద్ ఖాన్ (కేఆర్‌కే) గుర్తున్నాడు క‌దా! 'సీక్రెట్ సూప‌ర్‌స్టార్' విడుద‌ల స‌మ‌యంలో అత‌ని ఖాతాను ట్విట్ట‌ర్ నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు విడుద‌ల చేసి, ఆత్మ‌హ‌త్య చేసుకుంటాన‌ని బెదిరించిన‌ప్ప‌టికీ ట్విట్ట‌ర్ అత‌ని ఖాతాను పునః ప్రారంభించలేదు. దీంతో చేసేది లేక @KRKActor పేరుతో కొత్త ఖాతా తెర‌చి ట్విట్ట‌ర్‌లో మ‌ళ్లీ ప్ర‌వేశించాడు. వ‌చ్చీరాగానే ఖాన్ త్ర‌యాన్ని విమ‌ర్శిస్తూ ట్వీట్లు చేశాడు. దీంతో ఈ కొత్త ఖాతాను కూడా ట్విట్ట‌ర్ నిలిపివేసింది.
 
krk
kamal rashid khan
bollywood
critic

More Telugu News