ఇక సంక్రాంతికి రానున్న 'మిడిల్ క్లాస్ అబ్బాయి'!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇక సంక్రాంతికి రానున్న 'మిడిల్ క్లాస్ అబ్బాయి'!

  • మొదట్లో 'క్రిస్మస్'కి రిలీజ్ అనుకున్నారు 
  • తాజాగా ఆ నిర్ణయాన్ని మార్చుకున్న దిల్ రాజు 
  • సంక్రాంతి బరిలోకి దింపాలనే ఆలోచన    
నాని కథానాయకుడిగా వేణుశ్రీరామ్ దర్శకత్వంలో 'మిడిల్ క్లాస్ అబ్బాయి' చిత్రం రూపొందుతోంది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా సాయిపల్లవి నటిస్తోంది. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా వచ్చేనెల 22న విడుదల చేయాలనుకున్నారు. కానీ అదే రోజున అఖిల్ 'హలో' మూవీ వస్తోంది. నాగ్ రిక్వెస్ట్ తో ఈ విడుదల తేదీని మార్చుకుని, కాస్త ముందుగా అంటే వచ్చేనెల 15వ తేదీన విడుదల చేయాలని దిల్ రాజు నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వచ్చాయి.

 అయితే ఈ సినిమాను ఏకంగా సంక్రాంతికే విడుదల చేయాలని దిల్ రాజు భావిస్తున్నాడనేది తాజా సమాచారం. ఈ సినిమా కంటెంట్ యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేది కావడంతో, సంక్రాంతికి రిలీజ్ చేయడమే సరైనదనే ఉద్దేశంతో దిల్ రాజు వున్నాడని అంటున్నారు. మొత్తానికి సంక్రాంతికి రెడీ అవుతోన్న హీరోల జాబితాలో నాని కూడా చేరిపోయినట్టేనని చెప్పుకుంటున్నారు.      
nani
saipallavi

More Telugu News