హైదరాబాద్‌లో విదేశీ మహిళల సెక్స్ రాకెట్.. ఉజ్బెకిస్థాన్ మహిళలకు విముక్తి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్‌లో విదేశీ మహిళల సెక్స్ రాకెట్.. ఉజ్బెకిస్థాన్ మహిళలకు విముక్తి

  • రాచకొండలో సెక్స్ రాకెట్ ముఠా పనిపట్టిన పోలీసులు
  • ఉజ్బెకిస్థాన్ మహిళలకు విముక్తి
  • నిర్వాహకులు అదుపులోకి.. ప్రధాన నిందితుడు పరారీలో
హైదరాబాద్‌లో సాగుతున్న మరో సెక్స్ రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు విదేశీ మహిళలు వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడిచేసి ముగ్గురు నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఐదు సెల్‌ఫోన్లు, రూ.25 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. పట్టుబడిన ఉజ్బెకిస్థాన్‌కు చెందిన మహిళలకు విముక్తి కల్పించారు.  

నగరంలోని వ్యభిచార ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు తరచూ దాడులు నిర్వహిస్తూ అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు. గత వారం రోజుల్లోనూ మూడు ముఠాల గుట్టును రట్టు చేశారు. వ్యభిచార ముఠాలపై దాడులు కొనసాగుతూనే ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.
Hyderabad
S*x Rocket
Police

More Telugu News