ఒబామా కూతురు మ‌లియాను మీడియా బారి నుంచి కాపాడిన ఇవాంకా, చెల్సియా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒబామా కూతురు మ‌లియాను మీడియా బారి నుంచి కాపాడిన ఇవాంకా, చెల్సియా!

  • మీడియాపై విరుచుకుపడుతూ ట్వీట్లు
  • హ‌ద్దుల్లో ఉండాల‌ని వ్యాఖ్య‌
  • మ‌లియా వ్యక్తిగ‌త జీవితాన్ని ప్ర‌సారం చేసిన మీడియా
అమెరికా అధ్య‌క్షుడి కుటుంబం గురించి మీడియాకు ఎప్పుడూ ఆసక్తే. అధ్య‌క్షుడి కుటుంబానికి సంబంధించి ఏ చిన్న విష‌యాన్నీ మీడియా వ‌దిలిపెట్టదు. అయితే, మాజీల విషయంలో కొంత ఫోక‌స్ త‌గ్గిస్తారు కానీ, మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా కుటుంబం విష‌యంలో మాత్రం అలా జ‌ర‌గ‌లేదు. ఇటీవ‌ల ఒబామా పెద్ద కూతురు మ‌లియాకు సంబంధించి కొన్ని వార్త‌ల‌ను అక్క‌డి మీడియా ప్ర‌సారం చేసింది.

ఆమె పొగ తాగుతున్న‌ట్లు, ఓ యువ‌కుడిని ముద్దాడుతున్న‌ట్లు ఉన్న ఫొటోల‌ను అమెరిక‌న్ మీడియా ప్ర‌సారం చేయ‌డంపై ప్ర‌స్తుత అధ్య‌క్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా, మాజీ అధ్య‌క్షుడు బిల్ క్లింట‌న్ కుమార్తె చెల్సియాలు విరుచుకుప‌డ్డారు. ట్వీట్ల ద్వారా త‌మ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

'మలియా ఒబామా ఇప్పుడు ఒక సాధార‌ణ వ్య‌క్తి. వ్య‌క్తిగత గోప్య‌త ఆమె హ‌క్కు. మీడియా త‌న హ‌ద్దుల్లో ఉండాలి' అని ఇవాంకా ట్వీట్ చేయ‌గా,  'ఒక యువతిగా, విద్యార్థినిగా, సాధార‌ణ వ్య‌క్తిగా మలియా ఒబామాకు వ్యక్తిగత జీవితం ఉంటుంది. అది ప్రజల దృష్టిని ఆకర్షించడానికి కాదు. మీడియా కాస్త ఉన్నతంగా ప్ర‌వ‌ర్తించండి' అని చెల్సియా క్లింటన్‌ ట్వీట్‌ చేశారు.
ivanka trump
chelsea clinton
malia obama

More Telugu News