అన్ని సేవలకు ఒక‌టే యాప్‌... యోనో యాప్‌ను ఆవిష్క‌రించిన ఎస్‌బీఐ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అన్ని సేవలకు ఒక‌టే యాప్‌... యోనో యాప్‌ను ఆవిష్క‌రించిన ఎస్‌బీఐ!

  • యాప్‌ని ప్రారంభించిన అరుణ్ జైట్లీ
  • ఖాతా తెర‌వ‌డం నుంచి షాపింగ్ వ‌ర‌కు అన్ని సేవ‌ల‌కూ ఒక‌టే యాప్‌
  • ప్ర‌త్యేక ఆఫ‌ర్లు, డిస్కౌంట్లు కూడా
ప్ర‌భుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గ‌జం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త‌మ వినియోగ‌దారుల కోసం ఒక కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. యోనో (యూ నీడ్‌ ఓన్లీ వన్‌) పేరుతో ఉన్న ఈ యాప్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఆవిష్కరించారు. ఆన్‌లైన్‌లో బ్యాంకు ఖాతాను తెరవడం, లావాదేవీలు, రుణాల దరఖాస్తులు, ఆన్‌లైన్‌ షాపింగ్ వంటి ఎన్నో సేవ‌లు ఈ యాప్ ద్వారా అర్జించ‌వ‌చ్చు.

అంతేకాకుండా ఎస్‌బీఐ అనుబంధ సంస్థలైన ఎస్‌బీఐ లైఫ్, ఎస్‌బీఐ జనరల్, ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్, ఎస్‌బీఐ క్యాప్స్, ఎస్‌బీఐ కార్డ్స్ వంటి ఆర్థిక పథకాలన్నీ ఈ యాప్‌తో అనుసంధాన‌మై ఉంటాయి. ఆధార్‌ నంబరు, వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ ద్వారా ప‌నిచేసే ఈ యాప్ ఒక రకంగా డిజిటల్‌ బ్యాంకులాంటిదేనని ఎస్‌బీఐ చైర్మ‌న్ ర‌జ‌నీష్ కుమార్ తెలిపారు. వినియోగ‌దారుల కోసం ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు క‌ల్పించేందుకు 60కి పైగా ఈ–కామర్స్‌ సంస్థలతో ఎస్‌బీఐ ఒప్పందం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.
sbi
yono app
arun jaitley

More Telugu News