నేను ఎవరికీ నయాపైసా ఇవ్వను, ఇంటర్వ్యూలకు డబ్బులు అడుగుతాను అనడంలో నిజం లేదు!: వేణుమాధవ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను ఎవరికీ నయాపైసా ఇవ్వను, ఇంటర్వ్యూలకు డబ్బులు అడుగుతాను అనడంలో నిజం లేదు!: వేణుమాధవ్

  • ఎవరైనా కష్టంలో ఉంటే వెంటనే స్పందిస్తాను 
  • ఎవరినడిగినా ఈ సంగతి చెబుతారు 
  • ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇష్టం లేనప్పుడు అలా అంటాను 
"నేను ఎవరికీ నయా పైసా ఇవ్వను అనే ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదు .. ఆ విషయం ఉత్తేజ్ ను అడిగినా చెబుతాడు. మీరు జూనియర్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కి వెళ్లి అడిగినా చెబుతారు. ఇప్పటి వరకూ నేను సంపాదించిన దాంట్లో సగం వరకు ఇవ్వడమే జరిగింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కి నేను ఇచ్చిన విరాళం మీద వడ్డీ .. పేద కళాకారులకు వెళుతూ ఉంటుంది" అని ఒక ప్రశ్నకు సమాధానంగా ఐ డ్రీమ్స్ తో హాస్యనటుడు వేణుమాధవ్ అన్నారు.

"జూనియర్ ఆర్టిస్టులలో ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే .. నిజా నిజాలు తెలుసుకుని సాయం చేస్తుంటాను. ఆ విధంగా సాయపడటం నాకు సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఇక ఇంటర్వ్యూ ఇవ్వమంటే డబ్బులు అడుగుతాననే విషయంలో కూడా ఎంతమాత్రం నిజం లేదు. ఇంటర్వ్యూ ఇవ్వడం ఇష్టం లేనప్పుడు తప్పించుకోవడానికి అలా చేస్తుంటాను .. అది కూడా కొంతమంది విషయంలోనే. అంతే తప్ప .. నిజంగా డబ్బులు అడగాలని కానే కాదు" అంటూ నవ్వేశారు.    
venumadhav

More Telugu News