ట్రంప్ నా భార్యను లైంగికంగా వేధించాడు: హాలీవుడ్ హీరో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ట్రంప్ నా భార్యను లైంగికంగా వేధించాడు: హాలీవుడ్ హీరో

  • ట్రంప్ పై తీవ్ర లైంగిక ఆరోపణలు చేసిన హాలీవుడ్ హీరో బిల్ బ్లాడ్ విన్
  • మన్ హట్టన్ లోని ఒక హోటల్ లో చెన్యా ఫిలిప్ ను వేధించిన ట్రంప్
  • హెలికాప్టర్ లో బలవంతంగా ఆమెను తీసుకువెళ్లేందుకు కూడా ప్రయత్నించాడు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భార్యను లైంగికంగా వేధించాడని హాలీవుడ్ హీరో బిల్ బ్లాడ్ విన్ ఆరోపించడం కలకలం రేపుతోంది. గత కొంత కాలంగా హాలీవుడ్ లో లైంగిక వేధింపులపై సోషల్ మీడియా మాధ్యమంగా పోరాటం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తన భార్యపై జరిగిన వేధింపులను వెల్లడించారు.

న్యూయార్క్ లోని మన్ హట్టన్ లో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లినప్పుడు ఒక హోటల్ లో ట్రంప్ తన భార్య చెన్యా ఫిలిప్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బిల్ ఆరోపించాడు. ఆ కార్యక్రమానికి తన భార్యతో పాటు తాను కూడా వెళ్లానని చెప్పాడు. ఒంటరిగా ఆమెను గదిలోకి పిలిచిన ట్రంప్ ఆమెపై లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించాడని ఆరోపించాడు.

మహిళలను లైంగికంగా వేధించడంలో హాలీవుడ్ నిర్మాత అల్ ఫ్రాకేన్‌ ను ట్రంప్ మించిపోయాడని ఆయన తెలిపారు. తన భార్యను లైంగికంగా వేధించడమే కాకుండా ఆమెను బలవంతంగా తన హెలికాప్టర్ లో ఎక్కించుకుని వెళ్లేందుకు ట్రంప్ ప్రయత్నించాడని ఆయన ఆరోపించాడు. అల్ ఫ్రాకేన్ కంటే ట్రంప్ 5 రెట్లు ఎక్కువగా మహిళలను లైంగికంగా వేధిస్తాడని బిల్ బ్లాక్ విన్ తెలిపాడు.
billy Baldwin
Chynna Phillips
Donald Trump
harassment

More Telugu News