భారీగా పెరిగిపోయిన ట‌మోటా ధ‌ర‌లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారీగా పెరిగిపోయిన ట‌మోటా ధ‌ర‌లు!

  • ఢిల్లీలో కిలో టమోటా ధ‌ర రూ.80
  • మిజోరాంలో కిలో రూ.100
  • బెంగళూర్‌లో కిలో రూ 45 నుంచి రూ 50 మ‌ధ్య‌
  • భారీ వ‌ర్షాల‌తో ట‌మోటా పంట‌లకు న‌ష్టం
ట‌మోటా ధ‌ర‌లకి మరోసారి రెక్కలొచ్చాయి. ఈ రోజు ఢిల్లీలో కిలో టమోటా ధ‌ర‌ రూ.80 పలికింది. దేశంలోని ఇత‌ర ప్ర‌ధాన న‌గ‌రాల్లోనూ ప‌రిస్థితి ఇదే విధంగా ఉంది. మిజోరాంలో కిలో టమోటా కిలో రూ.100కు పైగా ప‌లుకుతోంది. మ‌రోవైపు టమోటాకు అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న‌ బెంగళూర్‌లో ధరలు కిలో రూ 45 నుంచి రూ 50 వరకు ఉన్నాయి.

కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్నాయి. మ‌ధ్యప్రదేశ్‌లో రైతులు మళ్లీ సాగు చేస్తున్న టమోటా మరో 20 రోజుల్లో మార్కెట్‌కు వస్తే ధ‌రలు అదుపులోకి రావ‌చ్చ‌ని అక్క‌డి వ‌ర్త‌కులు చెప్పారు. మ‌రోవైపు ఉల్లి ధ‌ర కూడా సామాన్యుడి కంట నీరు పెట్టిస్తోన్న విష‌యం తెలిసిందే.
tamota
rates
delhi

More Telugu News