టాలీవుడ్ లో ఈ నవంబర్ రికార్డు అవుతుందా...? ఇప్పటికే 22 సినిమాలు విడుదల!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టాలీవుడ్ లో ఈ నవంబర్ రికార్డు అవుతుందా...? ఇప్పటికే 22 సినిమాలు విడుదల!

  • వరుసగా సినిమాలు విడుదల
  • ఎక్కువగా చిన్న సినిమాలే
  • 'గరుడవేగ' తప్పిస్తే హిట్ అయిన మూవీ ఒక్కటీ లేదు
తెలుగు సినిమా చరిత్రలో 2017 నవంబర్ కు కాస్తంత ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే ఈ నెలలో ఇప్పటికే 22 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా, మరో నాలుగు విడుదలకు సిద్ధమవుతున్నాయి. పీఎస్వీ గరుడ వేగ, నెక్ట్స్ నువ్వే, ఏంజెల్, అదిరింది, ఒక్కడు మిగిలాడు, డిటెక్టివ్, కేరాఫ్ సూర్య, గృహం, ఖాకీ, స్నేహమేరా జీవితం, ప్రేమతో మీ కార్తీక్, ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం, లండన్ బాబులు, లవర్స్ క్లబ్, డేర్, నెపోలియన్, హే పిల్లగాడా, బాలకృష్ణుడు, జూన్ 1:43, మెంటల్ మదిలో, జంధ్యాల రాసిన ప్రేమకథ, దేవిశ్రీప్రసాద్.. ఇప్పటి వరకు విడుదలైన చిత్రాలివి.

ఇంకా ఆక్సిజన్, రారా, దొంగోడొచ్చాడు, ఇంద్రసేన సినిమాలు ఈ నెల్లోనే విడుదల కానున్నాయి. దీంతో మొత్తం 26 సినిమాలు ఈ నెల్లో వచ్చినట్టు అవుతుంది. అంటే ఇంచుమించు రోజుకో సినిమా చొప్పున విడుదలైనట్టు భావించాలి. అయితే 'గరుడవేగ' తప్పిస్తే వీటిలో గట్టిగా ఆడిన మూవీ ఒక్కటీ లేకపోవడం చిత్రం.
tollywood
movies release

More Telugu News