కావాలని పెద్ద హీరోలతో ఎప్పుడూ వెయిట్ చేయించ లేదు: వేణుమాధవ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కావాలని పెద్ద హీరోలతో ఎప్పుడూ వెయిట్ చేయించ లేదు: వేణుమాధవ్

  • టైము సెన్స్ లేదనే మాట నిజం కాదు 
  • ఆలస్యంగా షూటింగ్ కి వెళ్లడానికి కారణం అదే 
  • అందరి హీరోల దగ్గర నాకు చనువుంది  
కామెడీ విషయంలో వేణుమాధవ్ కి మంచి టైమింగ్ వుంది .. లేనిదల్లా టైమ్ సెన్స్ అనే టాక్ వుంది. అలాగే ఆయన పెద్ద హీరోలను వెయిట్ చేయించిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకుంటారు. అదే విషయం ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ప్రస్తావనకు రాగా .. వేణుమాధవ్ అందుకు సమాధానమిచ్చారు.

" నేను వున్న చోటు నుంచి షూటింగుకి వెళ్లడానికి కొంత ఆలస్యం అవుతుంది. ఆ విషయాన్ని కూడా ముందుగానే నేను చెబుతాను. అంతేగానీ ఉద్దేశ పూర్వకంగా ఆలస్యంగా వెళ్లను. ఇక నేను పెద్ద హీరోలను కూడా వెయిట్ చేయిస్తాననే మాటలో నిజం లేదు. ఒక చోట షూటింగ్ పూర్తి కాగానే మరో షూటింగ్ కి వెళ్లేవాడిని. మధ్యలో ప్రయాణానికి కొంత సమయం పడుతుంది కదా .. అలా ఆలస్యమయ్యేదే గానీ, కావాలని నేను పెద్ద హీరోలను ఎప్పుడూ వెయిట్ చేయించలేదు. అందరి హీరోలతోనూ నేను ఎంతో చనువుగానే ఉండేవాడిని" అంటూ స్పష్టం చేశారు.      
venumadhav

More Telugu News