సంజయ్ లీలా భన్సాలీ ఫ్యామిలీ గురించి నీకేం తెలుసో చెప్పు?: రాజాసింగ్ ను నిలదీసిన కత్తి మహేష్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సంజయ్ లీలా భన్సాలీ ఫ్యామిలీ గురించి నీకేం తెలుసో చెప్పు?: రాజాసింగ్ ను నిలదీసిన కత్తి మహేష్

  • సంజయ్ లీలా భన్సాలీ కుటుంబం గురించి మీకేమీ తెలియదు 
  • అసలు ఆయన ఫ్యామిలీ గురించి తెలిస్తే చెప్పండి
  • 'నోటికొచ్చినట్టు మాట్లాడేస్తారా?' అన్న మహేష్  
'సంజయ్ లీలా భన్సాలీ ఫ్యామిలీ గురించి తెలుసుకుని మాట్లాడండి' అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించడంపై సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'పద్మావతి' సినిమా వివాదం నేపథ్యంలో బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఒక టీవీ ఛానెల్ చేపట్టిన చర్చలో రాజాసింగ్ మాట్లాడుతూ, తనకు తెలుగులో సరైన భావవ్యక్తీకరణ రావడం లేదని, హిందీలో మాట్లాడుతానంటూ 'సంజయ్ లీలా భన్సాలీ ఫ్యామిలీ గురించి మీకేమైనా తెలుసా?' అని ప్రశ్నించారు.

'పద్మావతి ఇతిహాస్ (చరిత్ర) లో భాగం, అలాంటి ఇతిహాస్ ను మారుస్తారా? అది తప్పుకాదా? సంజయ్ లీలా భన్సాలీ ఫ్యామిలీ గురించి మీకేమైనా తెలుసా? ' అని అడిగారు. దీంతో కల్పించుకున్న కత్తి మహేష్... 'సరే ఇక్కడెవరికీ సంజయ్ లీలా భన్సాలీ కుటుంబం గురించి తెలియదు... మీరు చెప్పండి.. అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు' అన్నారు.

దీంతో రాజాసింగ్ మౌనం వహించారు. ఇక్కడ సీనులో లేని మనుషుల గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడడం అలవాటైపోయిందని కత్తిమహేష్ మండిపడ్డాడు. దీంతో రాజాసింగ్ వివరణ ఇస్తూ, నేను ఇప్పటికిప్పుడు చెప్పలేనని అన్నారు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన కత్తి మహేష్ 'చరిత్రలో ఉందని చెబుతున్న ఓ మహిళ గురించి మాట్లాడుతూ... ఇప్పుడున్న మహిళలందర్నీ అవమానిస్తున్నార'ని ఆగ్రహం వ్యక్తం చేశాడు.  
raja singh
katti mahesh
controversy comments

More Telugu News