రూ.6999కే నోకియా 2.. 45 జీబీ 4జీ డేటా ఫ్రీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రూ.6999కే నోకియా 2.. 45 జీబీ 4జీ డేటా ఫ్రీ!

  • నేటి నుంచి దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ మొబైల్ స్టోర్లలో అందుబాటులోకి
  • రిలయన్స్ జియోతో కలిసి ఉచిత డేటా ఆఫర్
  • ఏడాదిపాటు యాక్సిడెంటల్ డ్యామేజీ బీమా కూడా  
నోకియాను సొంతం చేసుకున్న హెచ్ఎండీ గ్లోబల్ మొబైల్ మార్కెట్లో నోకియాకు పూర్వవైభవం తెచ్చేందుకు ఎంతగానో కృషి చేస్తోంది. ఆకట్టుకునే ఫీచర్లతో, బడ్జెట్ ధరల్లో ఉండే స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తూ పాత కస్టమర్లను తిరిగి రప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల విడుదల చేసిన బడ్జెట్ ఫోన్ నోకియా 2ను ఇప్పుడు రిలయన్స్ జియోతో కలిసి బండిల్ ఆఫర్ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా అన్ని రిటైల్ మొబైల్ స్టోర్లలోనూ నోకియా 2 నేటి నుంచి అందుబాటులో ఉంటుంది. ధర రూ. 6,999.

ఈ ఫోన్ కొనుగోలు చేసిన వినియోగదారులకు 45 జీబీ 4జీ డేటాను ఉచితంగా లభిస్తుంది. వచ్చే ఏడాది ఆగస్టు 31 వరకు తొమ్మిది రీచార్జ్‌లతో ఈ ఆఫర్‌ను పొందవచ్చు. అలాగే కాంప్లిమెంటరీ కింద ఏడాది పాటు యాక్సిడెంటల్ డ్యామేజ్ బీమాను కల్పిస్తోంది. రూ.1000తో కోటక్ 811 సేవింగ్స్ ఖాతా తెరిచిన వారికి ఈ బీమా వర్తిస్తుందని హెచ్ఎండీ గ్లోబల్ ఇండియా హెడ్ అజయ్ మెహతా తెలిపారు.

నోకియా 2 ఫీచర్లు: 5 అంగుళాల డిస్‌ప్లే, 1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ మెమొరీ, 128 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు, 8 ఎంపీ ప్రైమరీ, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఓస్, 4100 ఎంఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ
Nokia
HMD Global
Nokia 2
Smart Phone

More Telugu News