భన్సాలీ ముందు జాగ్రత్త‌.. 'ప‌ద్మావ‌తి' సినిమాకు రూ.140 కోట్లతో బీమా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భన్సాలీ ముందు జాగ్రత్త‌.. 'ప‌ద్మావ‌తి' సినిమాకు రూ.140 కోట్లతో బీమా!

  • థియేట‌ర్లను త‌గుల‌బెడ‌తామ‌ని దేశ వ్యాప్తంగా హెచ్చ‌రిక‌లు
  • థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు రాక‌పోతే బీమా డ‌బ్బు
  • ప్ర‌భుత్వం సినిమాను నిషేధిస్తే నో క్యాష్‌
దీపికా ప‌దుకునే న‌టించిన ‘పద్మావతి’ సినిమాలో చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించార‌ని, అది విడుద‌ల చేస్తే థియేట‌ర్లను త‌గుల‌బెడ‌తామ‌ని దేశ వ్యాప్తంగా హిందూ సంఘాలు హెచ్చ‌రిక‌లు చేస్తోన్న విష‌యం తెలిసిందే. ఇటువంటి ఘ‌టనలు జరుగుతాయని ద‌ర్శ‌కుడు సంజ‌య్‌ భ‌న్సాలీ ముందే ఊహించినట్లున్నారు.

అందుకే, ఈ సినిమాకు ఆయ‌న రూ.140 కోట్లతో బీమా చేయించారని తెలిసింది. బీమా మొత్తంలో రూ.80 కోట్లు డిస్ట్రిబ్యూటర్లకు చెందుతుంది. ఈ సినిమాను ప్ర‌భుత్వం నిషేధిస్తే మాత్రం బీమా డ‌బ్బులు రావు. అలా కాకుండా సినిమా విడుద‌లై అల్ల‌ర్లు చెల‌రేగితే, భ‌యంతో థియేట‌ర్లకు ప్రేక్ష‌కులు రాక‌పోతే ఈ బీమా డబ్బులు వస్తాయి. ప‌ద్మావ‌తి సినిమాకు మహారాష్ట్రకు చెందిన బ్యాంకు బీమా కల్పించినట్లు తెలుస్తోంది.
padmavati
bheema
bhansali

More Telugu News