satyabhama university: నా కుమార్తె మృతికి సత్యభామ యూనివర్సిటీయే కారణం!: రాగ రాధమౌనికారెడ్డి తండ్రి
- సత్యభామ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన రాగ రాధమౌనికా రెడ్డి
- కౌన్సిలింగ్ ఇవ్వకుండా, ఆత్మహత్యకు పురిగొల్పేలా సిబ్బంది ప్రవర్తించారు
- సత్యభామ యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలి
ఎన్నో ఆశలతో సత్యభామ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ లో చేర్పించిన తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడడం పట్ల రాగ రాధమౌనికారెడ్డి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఒక కంపెనీలో జీఎంగా పని చేస్తున్న ఆయన మాట్లాడుతూ, తన కుమార్తె మృతికి ముమ్మాటికీ సత్యభామ యూనివర్సిటీయే కారణమని అన్నారు.
కౌన్సిలింగ్ ఇస్తే సర్దుకునే సమస్యను తీవ్రం చేసి, ఆమెను ఘోరంగా అవమానించి ఆత్మహత్యకు పురిగొల్పింది సత్యభామ యూనివర్సిటీయేనని ఆయన ఆరోపించారు. అన్యాయంగా తన కుమార్తెను పొట్టనబెట్టుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సత్యభామ యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.