మ‌రోసారి గాయాలపాలైన హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మ‌రోసారి గాయాలపాలైన హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్‌!

  • షూటింగ్ జ‌రుగుతుండ‌గా ఈ ఏడాది జూలైలోనూ గాయాలు
  • ప్ర‌స్తుతం జోధ్‌పూర్‌లో మ‌ణిక‌ర్ణిక సినిమా షూటింగ్‌
  • ఓ సన్నివేశం కోసం స్టంట్‌ చేస్తుండగా కాలికి గాయం
  • కొన్ని వారాలు విశ్రాంతి
బాలీవుడ్ 'క్వీన్' కంగనా రనౌత్ మ‌రోసారి గాయాల‌పాలైంది. ఆమె ప్రధాన పాత్రలో నిర్మితమవుతున్న 'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ జాన్సీ' చిత్రం షూటింగ్‌ ఈ ఏడాది జులైలో హైద‌రాబాద్ లో జ‌రుగుతుండగా ఆమెకు గాయాలైన విష‌యం తెలిసిందే. నిన్న ఈ సినిమా షూటింగ్‌ జోధ్‌పూర్‌లో జరిగింది. ఈ సినిమాలోని ఓ సన్నివేశం కోసం స్టంట్‌ చేస్తుండగా ఆమె కాలికి గాయమైనట్లు స‌మాచారం.

ఈ ఘ‌ట‌న‌పై ఆమెకు చికిత్స చేస్తోన్న వైద్యుడు మాట్లాడుతూ కంగన కుడి కాలు బెణికిందని అన్నారు. ఆమెకు చికిత్స చేశామ‌ని, కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంద‌ని తెలిపారు. చికిత్స తీసుకుని ఆమె జోధ్‌పూర్ నుంచి ముంబయికి వెళ్లారు. మణికర్ణిక సినిమాకి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.
   
kangana ranout
manikarnika
cinema

More Telugu News