ఎట్ట‌కేల‌కు సంగీత అత్త‌, మామ, మ‌రిది అరెస్ట్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎట్ట‌కేల‌కు సంగీత అత్త‌, మామ, మ‌రిది అరెస్ట్!

  • అత్తామామ‌ల‌ను అరెస్టు చేయాల‌ని సంగీత ప్ర‌ధాన డిమాండ్
  • హైద‌రాబాద్‌లోని మ‌ల్కాజిగిరిలో అరెస్ట్
  • మేడిప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లింపు
త‌న‌ భ‌ర్త, టీఆర్ఎస్ బ‌హిష్కృత నేత శ్రీనివాస్‌ చేతిలో చిత్ర హింస‌ల‌కు గురైన సంగీత త‌న అత్తా‌మామ‌ల‌ను అరెస్టు చేయాల్సిందేన‌ని డిమాండ్ చేస్తోన్న విష‌యం తెలిసిందే. నాలుగు రోజులుగా భ‌ర్త ఇంటి ముందు ధ‌ర్నా చేస్తోన్న ఆమెకు న్యాయం చేస్తామ‌ని ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు కూడా హామీ ఇచ్చారు. సంగీత నుంచి ఫిర్యాదు సేక‌రించిన పోలీసులు ఎట్ట‌కేల‌కు ఆమె అత్త‌, మామ‌, మ‌రిదిని అరెస్టు చేశారు.

హైద‌రాబాద్‌లోని మ‌ల్కాజిగిరీలో వారిని అదుపులోకి తీసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. నిందితుల‌ను మేడిప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. సంగీత అత్త‌, మామ‌ల పేర్లు ఐల‌మ్మ‌, బాల్‌రెడ్డిగా పేర్కొన్నారు. త‌న అత్తామామ‌ల‌ను అరెస్టు చేయాల‌ని సంగీత త‌న ప్ర‌ధాన డిమాండ్‌గా చెబుతోన్న విష‌యం తెలిసిందే.    
sangita
arrest
Hyderabad

More Telugu News