మోడ‌ల్‌గా ప్ర‌పంచంలో అత్య‌ధిక పారితోషికం పొందిన‌ కెండ‌ల్ జెన్న‌ర్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోడ‌ల్‌గా ప్ర‌పంచంలో అత్య‌ధిక పారితోషికం పొందిన‌ కెండ‌ల్ జెన్న‌ర్‌

  • వెల్ల‌డించిన ఫోర్బ్స్ మేగ‌జైన్‌
  • గ‌తేడాది 22 మిలియ‌న్ డాల‌ర్లు వెన‌కేసుకున్న కెండ‌ల్‌
  • రెండో స్థానంలో జిసెల్‌ బుండ్‌చెన్‌
22 ఏళ్ల కెండ‌ల్ జెన్న‌ర్ మోడ‌లింగ్ ద్వారా ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా సంపాదిస్తున్న మ‌హిళ‌గా నిలిచిన‌ట్లు ఫోర్బ్స్ మేగ‌జైన్ వెల్ల‌డించింది. జూన్, 2016 - జూన్, 2017 మ‌ధ్య కాలంలో ఆమె మోడ‌లింగ్ ద్వారా 22 మిలియ‌న్ డాల‌ర్లు సంపాదించిన‌ట్లు ఫోర్బ్స్ ప్ర‌క‌టించింది. ఎస్టీ లాడ‌ర్‌, లా పెర్లా, అడిడాస్ వంటి సంస్థ‌ల‌కు మోడలింగ్ చేయ‌డంతో పాటు, త‌న సోద‌రి కైలీ జెన్న‌ర్‌తో క‌లిసి చేస్తున్న టీవీ షోల ద్వారా ఆమె పెద్ద‌ మొత్తంలో ఆర్జించిన‌ట్లు తెలుస్తోంది.

ఇక గ‌త 15 ఏళ్లుగా మొదటి స్థానంలో ఉన్న జిసెల్ బుండ్‌చెన్ ఇప్పుడీ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జిసెల్ సంపాద‌న 17.5 మిలియ‌న్ డాల‌ర్లు. మూడో స్థానంలో క్రిస్సీ టైజ‌న్ (13.5 మిలియ‌న్ డాల‌ర్లు) ఉంది. టాప్ 10లో ఉన్న మోడ‌ళ్ల సంయుక్త సంపాద‌న 109.5 మిలియ‌న్ డాల‌ర్లు ఉన్న‌ట్లుగా ఫోర్బ్స్ పేర్కొంది. అయితే ఈ సారి జాబితాలో ఉన్న మోడ‌ళ్ల‌లో ఎక్కువ మంది ఇన్‌స్టాగ్రాం వంటి సోష‌ల్ మీడియా మాధ్య‌మాల్లో క్రియాశీల‌కంగా ఉన్న‌వారే కావ‌డం గ‌మ‌నించాల్సిన విష‌యమ‌నే ఫోర్బ్స్ తెలిపింది.
kendall jenner
highest paid
remuneration
modelling
instaram

More Telugu News