నేను చేయాలనుకుంటోన్న హీరోల లిస్ట్ చాలా పెద్దదే: మెహ్రీన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను చేయాలనుకుంటోన్న హీరోల లిస్ట్ చాలా పెద్దదే: మెహ్రీన్

  • స్టార్ హీరోలందరితోను చేయాలనుంది 
  • ఆ అవకాశం కోసమే వెయిట్ చేస్తున్నాను 
  • బాలీవుడ్ ఎంట్రీ గురించి ఏమీ ఆలోచించలేదు    
తొలి మూడు సినిమాలతోనే మెహ్రీన్ హ్యాట్రిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. దాంతో ఆమెను తమ సినిమాల్లోకి తీసుకోవడానికి దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారు. ఇక యువ కథానాయకులు కూడా హీరోయిన్ గా ఆమెకి ఛాన్స్ ఇవ్వడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో .. "టాలీవుడ్ లో ఏ హీరోలతో కలిసి నటించాలని వుంది?" అనే ప్రశ్న ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మెహ్రీన్ కి ఎదురైంది.

 అందుకామె స్పందిస్తూ " నిజం చెప్పాలంటే నేను చేయాలనుకుంటోన్న హీరోల లిస్ట్ చాలా పెద్దది. పవన్ కల్యాణ్ .. చరణ్ .. అల్లు అర్జున్ .. మహేశ్ బాబు .. ఎన్టీఆర్ .. ప్రభాస్ తో కలిసి నటించాలని వుంది. వాళ్ల సరసన అవకాశాల కోసమే వెయిట్ చేస్తున్నాను. "ఇక బాలీవుడ్ సినిమాలు చేయాలని ఉందా?" అనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ " ప్రస్తుతం నేను తెలుగు సినిమాలతోనే చాలా బిజీగా వున్నాను. అందువలన తెలుగు సినిమాలపైనే దృష్టి పెట్టాను. ఏ విషయంలోనూ ముందుగా ప్లాన్ చేసుకోవడమంటూ ఉండదు. వచ్చిన అవకాశాలను బట్టి ముందుకు వెళుతూ వుంటాను" అని చెప్పుకొచ్చింది.       
mehreen

More Telugu News