నా తొలికారుతో ఇబ్బంది పడ్డా.. అదంటే మాత్రం చాలా ఇష్టం!: సల్మాన్ ఖాన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా తొలికారుతో ఇబ్బంది పడ్డా.. అదంటే మాత్రం చాలా ఇష్టం!: సల్మాన్ ఖాన్

  • ‘జమానా’లో రిషీ కపూర్‌ నడిపిన కారును సల్మాన్ కు గిఫ్ట్ గా ఇచ్చిన తండ్రి 
  • ఆ కారుకి బ్రేకులు, డోర్ హ్యాండిల్స్, ఫ్లోరింగ్ బోర్డ్ ఏమీ లేవు
  • టైర్ల కింద పెట్టి కారును ఆపి ఉంచడానికి పెద్దరాళ్లను తీసుకెళ్లే వాడిని
సల్మాన్ ఖాన్ కు తన తొలి కారంటే చాలా ఇష్టం. ఆ కారు అనుభవాన్ని సల్మాన్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. ఆ కారుతో ఎక్కడికైనా వెళ్లాలంటే అందులో రాళ్లు పెట్టుకుని వెళ్లేవాడినని సల్మాన్ తెలిపాడు. ఆ కారుకు బ్రేకులు ఉండేవి కాదని, అందుకే దానిని ఆపినప్పుడు దొర్లుకుంటూ వెళ్లిపోకుండా టైర్లకు అడ్డం పెట్టేందుకు వాటిని వినియోగించేవాడినని తెలిపాడు.

అంతే కాకుండా, దాని డోర్ కి హ్యాండిల్స్ లేవని, ఫ్లోరింగ్ బోర్డ్ లేదని చెప్పాడు. ఆ కారు ‘హెరాల్డ్‌’ కారని, దానిని 1985 లో బ్లాక్‌ బస్టర్‌ సినిమా ‘జమానా’లో రిషీ కపూర్‌ నడిపాడని, ఈ సినిమాలో రాజేష్‌ ఖన్నా, పూనమ్‌ థిల్లాన్‌ కూడా నటించారని అన్నాడు. ఆ సినిమాకి రచయిత తన తండ్రేనని, దీంతో దానిని సెకండ్‌ హ్యాండ్‌ గా కొని తనకు బహుమతిగా ఇచ్చారని అన్నాడు.

ఆ కారు ఎలా ఉన్నా... దాంతో ఎలాంటి ఇబ్బందులు పడ్డా, అదంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. తన ఫస్ట్ కారు అదేనని సల్మాన్ గుర్తు చేసుకున్నాడు. సల్మాన్ ప్రస్తుతం రేంజ్ రోవర్ వాడుతున్నాడు. అతని గ్యారేజ్ లో ఖరీదైన పలు కార్లు ఉన్నాయి. 
Salman Khan
frist car experience
herald car

More Telugu News